- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పిల్లల సమస్యలు పరిష్కరిస్తా.. తెలంగాణ హోంమంత్రి హామీ
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఇందుకోసం ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో మాట్లాడి బస్సులను అందుబాటులోకి తెస్తామని, షీ టీమ్స్‌తో పిల్లలకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం బెంగుళూరుకు చెందిన చైల్డ్ రైట్స్ అండ్ యూ (క్రై) సంస్థ తెలుగు రాష్ట్రాల ప్రతినిధి పీటర్ సునిల్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం మంత్రి మహమూద్ అలీని కలిసి విద్యార్థులు గీసిన ఛాయా చిత్రాల బుక్‌లెట్‌ను మంత్రికి అందజేశారు. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో గత రెండేండ్ల నుంచి 18 ఏండ్లలోపు పిల్లలు కొత్తగా ఏమీ నేర్చుకోకపోగా, నేర్చుకున్నవి మర్చిపోయారని, ఈ నేపథ్యంలో వారికి మంచి విద్య అందించేందుకు కృషి చేయాలని మంత్రిని కోరారు. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు, వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలల నుంచి మాన్పించి ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారని గుర్తుచేశారు.
ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత లేకుండా, నాణ్యమైన విద్య అందించే విధంగా కృషి చేయాలని కోరారు. అంతేగాకుండా.. పాఠశాలల్లో మౌలిక వసతులు, రవాణా సౌకర్యం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, షేరింగ్ ఆటోలు, బస్సుల్లో వేధింపులు ఎదుర్కొంటూ నిరుత్సాహంతో విద్యను మానేయాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడుతున్నాయని గుర్తుచేశారు. దీనికి స్పందించిన మంత్రి రవాణా సౌకర్యం లేని ప్రాంతాలను తన దృష్టికి తీసుకురావాలని, వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల ప్రజాధ్వని గౌరవ అధ్యక్షుడు లక్ష్మణరావు, శ్యామల అశోక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృపావేణి, అంజలి, కంచుకట్ల సుభాష్, పీబా, జెర్ర ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.