సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన హోం మినిస్టర్.. ఎందుకంటే

by Shyam |
Home Minister Mahmood Ali
X

దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. కరోనా, లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడినప్పటికీ, ప్రజా సంక్షేమం, వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్యం, మౌలిక వసతుల రంగాలకు, హోం శాఖకు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేశారని తెలిపారు. దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ రూ.1000 కోట్ల బడ్జెట్, వ్యవసాయానికి రూ.1500 కోట్లు, భూ సమగ్ర సర్వే కోసం రూ.400 కోట్లు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మికి రూ.2750 కోట్లు, మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.1000 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్ కోసం రూ.750 కోట్లు ఇలా అన్ని రంగాలకు, పథకాలకు భారీగా నిధులు కేటాయించడం పట్ల హోం మంత్రి హర్షం వ్యక్తం చేశారు. హోం శాఖకు 6,465 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు, ఆర్థిక మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు పోలీస్ సేవలు ఇంకా మెరుగ్గా అందించే వీలు కలుగుతుందని అన్నారు.

Advertisement

Next Story