ఆందోళన వద్దు… జాగ్రత్తలు తీసుకోవాలి

by Shyam |
ఆందోళన వద్దు… జాగ్రత్తలు తీసుకోవాలి
X

దిశ, క్రైమ్‌బ్యూరో: కరోనా వైరస్ పట్ల ఆందోళన చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. తాను కూడా వైరస్ బారిన పడి కోలుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారులతో ప్రస్తావించారు. కరోనా పరిస్థితులపై సోమవారం పోలీస్ కమిషనర్లు, ఉన్నతాధికారులతో హోంమంత్రి టెలిఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైరస్ బారిన పడిన పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై ఆరా తీశారు. కరోనా రోగుల పట్ల, వారిని ఆసుపత్రికి తరలించే విషయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. వ్యాధి పట్ల ప్రజలను అప్రమత్తం చేయడంలో పోలీసుల కృషిని అభినందించారు. “కొవిడ్ వారియర్స్”గా పోలీస్ సిబ్బంది చక్కటి పనితీరును కనబరిచి ప్రజల మెప్పు పొందిందన్నారు.

Advertisement

Next Story