హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే..!

by Harish |   ( Updated:2021-11-26 06:32:47.0  )
homeloan
X

దిశ, వెబ్‌డెస్క్: సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. ఆ కలను నెరవేర్చుకునేందుకు నెలనెల కొంత డబ్బుని పొదుపు చేసుకుంటారు. అయితే ప్రస్తుత సమయంలో చిన్న ఇల్లు కట్టాలన్నా రూ.10 లక్షలు తప్పడం లేదు. అందుకు తగ్గ బడ్జెట్ లేదనకున్న వాళ్లు బ్యాంక్ లోన్ తీసుకొని తమ కలను సాకారం చేసుకోవడం సహజం. అలా బ్యాంక్ నుంచి లోన్ తీసుకునేముందు మీరు తగినంత బ్యాగ్రౌండ్ వర్క్ చేయాలి. హోమ్ లోన్ ప్రక్రియలో బ్యాంక్ ఎంపిక అనేది చాలా ముఖ్యం. బ్యాంక్ ఎంపికలో కొన్ని ముఖ్యమైన అంశాలను మీరు గమనించాలి.

బ్యాంకులను ఎలా ఎంపిక చేసుకోవాలంటే..

వడ్డీ రేటు: హోమ్ లోన్ తీసుకునేముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం బ్యాంక్ వడ్డీరేటు. మార్కెట్లో రెండు రకాల వడ్డీరేటు ప్లాన్‌లు ఉన్నాయి. అవి ఫ్లోటింగ్, స్థిర వడ్డీ రేట్లు. ఫ్లోటింగ్ వడ్డీరేటు ఎల్లప్పుడు ఒకే విధంగా ఉండదు. కాలనుగుణంగా మారుతూ ఉంటుంది. RBI బేస్ రేటు, మార్కెట్ పరిస్థితులల్లో మార్పుల ఆధారంగా భవిష్యత్తులో హెచ్చు తగ్గులు ఉంటాయి. మరొకటి స్థిర వడ్డీరేటు. ఇది ఎల్లప్పుడు ఒకే విధంగా ఉంటుంది. భవిష్యత్తులో వడ్డీ రేటు పెరిగిన ఆ పెరుగుదల అనేది స్థిర వడ్డీరేటు పై ఉండదు. వీటిల్లో మీకు నచ్చిన వడ్డీ రేటును ఎంచుకోవచ్చు.

క్రెడిట్ స్కోర్ : హోమ్ లోన్‌కు మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలి. 750 కంటే ఎక్కువ ఉంటే, తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని పొందవచ్చు. హోమ్ లోన్ కోసం అప్లై చేసే ముందు క్రెడిట్ స్కోర్‌ని చెక్ చేసుకోవడం మంచిది. ఇంతకు ముందు ఉన్నటువంటి లోన్‌లను క్లియర్ చేయడం ద్వారా క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవచ్చు.

డౌన్ పేమెంట్: డౌన్ పేమెంట్ అనేది తక్కువ ఉంచుకోని ఎక్కువ కాలం ఈఎంఐలు పెట్టుకోవడం వలన చెల్లింపులు భారం కాకుండా ఉంటాయి. లోన్ EMIలను ప్రతి నెల క్రమం తప్పుకుండా వాయిదా పద్ధతిలో తిరిగి బ్యాంక్‌కు చెల్లించడం ఉత్తమం.

ఛార్జీలు: లోన్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు ప్రాసెసింగ్ ఫీజులు, లేట్ చెల్లింపు పెనాల్టీలు, ఫోర్‌క్లోజర్ ఛార్జీలు మొదలైన ఇతర ఛార్జీలను చెల్లించాలి. వీటి గురించి ముందే బ్యాంకుతో మాట్లాడుకోవాలి. దీని వల్ల వాటిల్లో కొన్నిటిని రద్దు చేయించుకోవచ్చు.

బీమా: హోమ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నప్పుడు బీమా చేయించుకోవడం మంచిది. చివరగా, తప్పనిసరిగా లోన్‌కు సంబంధించిన ప్రతి పేపర్‌ను చదవాలి. అన్ని పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి. లేకపోతే బ్యాంకులు వడ్డించే ఇతర చార్జీలతో ఈఎంఐ కంటే అధికంగా చెల్లించాల్సి వస్తుంది అనడంలో సందేహం లేదు.

Advertisement

Next Story

Most Viewed