ఏపీలో స్కూల్స్‌కి మే 3 వరకు సెలవులు

by srinivas |
ఏపీలో స్కూల్స్‌కి మే 3 వరకు సెలవులు
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ సెలవులు పెంచింది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌‌డౌన్ కాలపరిమితి పెంచిన కారణంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకూ మే 3 వరకూ సెలవులను పొడిగిస్తున్నట్టు విద్యాశాఖ కమిషనర్ చిన వీరభద్రుడు ప్రకటించారు. విద్యా సంవత్సర క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది అంటే 2019-20 విద్యా సంవత్సరం రేపటితో ముగియాల్సివుంది. అయితే కరోనా కారణంగా అర్ధాంతరంగా సెలవులిచ్చిన సంగతి తెలిసిందే.

ప్రాధమిక, ఉన్న విద్య పరీక్షలు నిర్వహించాల్సిన సమయంలో కరోనా వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ కారణంగా ఇచ్చిన సెలవులను మరోమారు పొడిగించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో మే 3వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోసారి సమావేశమై అప్పటి పరిస్థితులను సమీక్షించి, సెలవులను పొడిగించాలా? లేక పరీక్షలు నిర్వహించాలా? అన్న విషయమై ఓ నిర్ణయానికి వస్తామని విద్యా శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

ఏపీలో కేవలం ఇంటర్ పరీక్షలు ముగియగా, ఇతర విద్యలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రాధమిక, ఉన్నత విద్య వరకు అటెండెన్స్ ఆధారంగా పై తరగతులకు ప్రమోషన్ ఇవ్వాలని విద్యాశాఖ గతంలోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే విద్యను పూర్తి చేసే (చివరి సంవత్సరం విద్యార్థులకు) ఇతరులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

Tags: andhra pradesh, school education, exam, promotion, education department,

Advertisement

Next Story

Most Viewed