హాకీ ఒలంపియన్ రవీందర్ పాల్ మృతి

by Sumithra |
హాకీ ఒలంపియన్ రవీందర్ పాల్ మృతి
X

దిశ, స్పోర్ట్స్ : భారత హాకీ మాజీ ఆటగాడు, మాస్కో ఒలంపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన జట్టులో సభ్యుడైన రవీందర్ పాల్ సింగ్ (60) శనివారం ఉదయం కొవిడ్ కారణంగా మృతి చెందారు. గత నెల రవీందర్ కరోనా బారిన పడటంతో ఆయనను లక్నోలోని వివేకానంద ఆసుపత్రిలో చేర్పించారు. ఈ నెల 6న ఆయనకు కరోనా నెగెటివ్ రావడంతో ఆసుపత్రిలోని సాధారణ వార్డుకు తరలించారు. అయితే శుక్రవారం రాత్రి ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించింది.

వెంటనే ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినా లాభం లేకపోయింది. శనివారం ఉదయం ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తన జీవితమంతా హాకీకే అంకితం చేసిన రవీందర్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోయాడు. అతడు చనిపోయే వరకు మేనకోడలకు ప్రగ్యా యాదవ్ చూసుకున్నారు. కాగా, మాస్కో ఒలంపిక్స్ తర్వాత లాస్ ఏంజెల్స్ లోనూ ఆయన పాల్గొన్నారు. రవీందర్ పాల్ మృతి పట్ల కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed