- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాకీ ఒలంపియన్ ఇనామ్ ఉర్ రెహ్మాన్‌కు పురస్కారం
by Shyam |
X
దిశ, స్పోర్ట్స్: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని మధ్యప్రదేశ్ ప్రభుత్వం క్రీడాకారులకు అవార్డులు అందించింది. ఈ నేపథ్యంలోనే 1968 మెక్సికో ఒలంపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన మాజీ హాకీ ప్లేయర్ ఇనామ్-ఉర్-రెహ్మాన్‌కు జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రకటించారు.
2002 నుంచి మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్ర క్రీడాకారులకు అవార్డులు ప్రకటిస్తున్నది. ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 28 మంది క్రీడాకారులకు అవార్డులు ప్రకటించగా, వారిలో 14 మందిని ఏకలవ్య అవార్డుకు, 10 మందిని విక్రమ్ అవార్డులకు, ముగ్గురిని విశ్వామిత్ర అవార్డులకు నామినేట్ చేశారు. ఒకరికి లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు వరించింది. త్వరలో జరుగబోయే ఒక కార్యక్రమంలో ప్రభుత్వం క్రీడాకారులకు అవార్డులు అందించనుంది.
Advertisement
Next Story