ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీకి ఇండియా హకీ జట్టు ప్రకటన

by Shyam |
ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీకి ఇండియా హకీ జట్టు ప్రకటన
X

దిశ, స్పోర్ట్స్ : ఢాకా వేదికగా వచ్చే నెలలో జరుగనున్న ఏసియన్ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొననున్న భారత హాకీ జట్టును శుక్రవారం ప్రకటించారు. 20 మంది సభ్యులతో నిండిన జట్టును హాకీ ఇండియా వెల్లడించింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన అనంతరం భారత పురుషుల హాకీ జట్టు మరో అంతర్జాతీయ ఈవెంట్‌లో తలపడటం ఇదే తొలి సారి. కెప్టెన్‌గా మన్‌ప్రీత్ సింగ్, వైస్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ సింగ్ కొనసాగుతున్నారు. వీరితో పాటు గోల్ కీపర్లుగా క్రిషన్ బి పాథక్, సూరజ్ కర్కేరాను చేర్చారు. భారత జట్టు తొలి మ్యాచ్ డిసెంబర్ 14న కొరియాతో తలపడనున్నది. ఇక డిసెంబర్ 15న ఆతిథ్య బంగ్లాతో ఆడనున్నది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో డిసెంబర్ 17న తలపడనున్నది. ఆ తర్వాత రోజు మలేషియాతో, డిసెంబర్ 19న జపాన్‌తో లీగ్ మ్యాచ్ జరుగనున్నది.

భారత జట్టు: క్రిషన్ బి పాథక్, సూరజ్ కర్కేరా, హర్మన్ ప్రీత్ సింగ్, గురీందర్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్, డిప్సన్ టిర్కే, వరుణ్ కుమార్, నీలమ్ సంజీప్, మన్‌దీప్ మోర్, హార్దిక్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, జస్కరన్ సింగ్, సుమిత్, రాజ్‌కుమార్ పాల్, ఆకాశ్ దీప్ సింగ్, షంశేర్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ, దిల్ ప్రీత్ సింగ్, గురుసాహిబ్‌జిత్ సింగ్, శిలానంద్ లక్రా

Advertisement

Next Story

Most Viewed