హోండా యాక్టివా ఎడిషన్‌ 6జీ లాంచ్

by Anukaran |   ( Updated:2020-11-26 10:48:02.0  )
హోండా యాక్టివా ఎడిషన్‌ 6జీ లాంచ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్కూటర్ విభాగంలో అత్యంత ఆదరణ కలిగిన యాక్టివా ప్రత్యేక ఎడిషన్‌ను హోండా కంపెనీ లాంచ్ చేసింది. భారత్‌లో హోండా యాక్టివా బ్రాండ్‌ను ప్రవేశపెట్టి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన స్కూటర్ యాక్టివా 6జీ ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ఈ స్కూటర్ ధరను రూ. 66,816(ఎక్స్‌షోరూమ్-ఢిల్లీ)గా నిర్ణయించింది.

‘యాక్టివా రెండు దశాబ్దాల లీడర్‌షిప్ జర్నీతో సుమారు 2 కోట్ల మంది భారతీయ వినియోగదారుల నమ్మకాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా యాక్టివా 6జీ 20వ వార్షికోత్సవ ఎడిషన్‌ను విడుదల చేస్తున్నామని’ హోండా మోటార్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ‘యాక్టివా తొలి నుంచి యువతతో పాటు అన్ని వర్గాల వారికి మొదటి ఎంపికగా నిలిచింది. ప్రతి కొత్త తరానికి ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో హోండా యాక్టివాను పరిచయం చేస్తూ వచ్చామని’ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అత్సుషి ఒగాటా చెప్పారు. కాగా, యాక్టివా 6జీ 20వ వార్షికోత్సవ ఎడిషన్ రెండు వేరియంట్లలో లభించనుందని, వీటి ధర రూ. 66,816, రూ. 68,316గా నిర్ణయించినట్టు కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story