- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోటి మొక్కలు సిద్ధం: హెచ్ఎండీఏ
దిశ, న్యూస్‌బ్యూరో: ఈ ఏడాది హరితహారం కార్యక్రమానికి కోటి మొక్కలను సిద్ధం చేస్తున్నామని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, హెచ్ఎండిఏ కమిషనర్ అర్వింద్ కుమార్ తెలిపారు. శనివారం తెల్లాపూర్‌లో 150ఎకరాల విస్తీర్ణంలో గల హెచ్ఎండీఏ అర్బన్ పారెస్ట్రీ నర్సరీని ఆయన సందర్శించారు. హెచ్ఎండీఏ పరిధిలోని ఖాళీ స్థలాలతో పాటు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో గ్రీనరీ పెంచేందుకు అనుగుణంగా కోటి మొక్కలకు పైగా సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాల నుంచి వచ్చే ప్లాంటేషన్ ఆర్డర్లకు అనుగుణంగా మొక్కలను అందజేసేట్లుగా హెచ్ఎండీఏ యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని కమిషనర్ అర్బన్ ఫారెస్ట్రీ అధికారులను ఆదేశించారు. గతేడాది ఆగస్టు 28న తెల్లాపూర్ నర్సరీలో తాను మియావాకి పద్ధతిలో నాటిన మొక్క(మర్రి) ఎదుగుదల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేవలం 8నెలల కాలంలోనే రెట్టింపుగా మొక్క ఎదుగుదల ఉందని తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు అర్బన్ ఫారెస్ట్రీ అసిస్టెంట్ డైరెక్టర్ ఐ. ప్రకాశ్, అర్బన్ ఫారెస్ట్ మేనేజర్ సి. శ్రీనివాస్‌తో పాటు పలువురు సిబ్బంది ఉన్నారు.