- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'హిట్'కు 'హింట్'
‘హిట్’ మూవీ… ఫిబ్రవరి 28న స్క్రీన్స్ ‘హిట్’ చేయనుంది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌లో నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్న ఈ మూవీలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన సినిమా ప్రారంభం నుంచే హైప్ క్రియేట్ చేసింది. ఫస్ట్ లుక్ నుంచి టీజర్ వరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో పోలీస్ ఆఫీసర్‌గా వర్క్ చేస్తాడు. ఈ టైంలోనే ప్రీతి అనే అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. ఆ అమ్మాయిని వెతికే క్రమంలో హీరో ఎదుర్కొనే పరిస్థితులే సినిమా. కాగా హిట్ అంటే ఏంటి? అని చాలా మంది ప్రేక్షకులు అడగగా… దీనికో చిన్న క్లూ ఇచ్చింది చిత్ర యూనిట్. HIT అంటే ‘హోమీసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్’ అని ఓ వీడియో రిలీజ్ చేసింది. ప్రీతి కేసుకు సంబంధించి మరిన్ని సమాధానాలు కావాలంటే ఫిబ్రవరి 28 నుంచి థియేటర్లకు వెళ్లి చూడాలని వినూత్నంగా ప్రమోషన్స్ ప్లాన్ చేసింది.
ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాని… హిట్ మీనింగ్ ఇప్పటికైతే ఇదే… కానీ ఫిబ్రవరి 28 నుంచి హిట్ మీనింగ్ మారుతుందన్నాడు. హిట్ సినిమా హిట్ కొడుతుందని ఇండైరెక్ట్‌గా చెప్పిన నాని.. బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమనే అభిప్రాయంలో ఉన్నాడు.