గతేడాది ఆగస్టు 8 నాకు ఎంతో ఇష్టం : ప్రణబ్ కూతురు

by Shamantha N |   ( Updated:2020-08-12 06:05:41.0  )
గతేడాది ఆగస్టు 8 నాకు ఎంతో ఇష్టం : ప్రణబ్ కూతురు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. సామాన్యులతో సహా ప్రముఖులంతా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా దేశ మాజీ రాష్ట్రపతి ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన కూతురు, కాంగ్రెస్ నేత షర్మిష్ఠ ముఖర్జీ బుధవారం ఓ ట్వీట్ చేశారు.

తన తండ్రి త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్న అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
‘గతేడాది ఆగస్టు 8 నాకు చాలా సంతోషకరమైన రోజు. మా నాన్న అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఆ రోజే అందుకున్నారు. ఏడాది పూర్తి కాగానే ఆగస్టు 10న ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. అంతేగాకుడా మానాన్న విషయంలో భగవంతుడికి ఏది సరైనది అనిపిస్తే అదే చేస్తే బాగుంటుంది. ఆనందాన్నైనా… బాధనైనా తట్టుకునే శక్తిని భగవంతుడు నాకు ప్రసాదించాలని, అందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు ప్రకటిస్తున్నాను ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story