భర్త నిజస్వరూపాన్ని బయటపెట్టిన నటి.. వేరే గదిలో ప్రియురాలితో

by Anukaran |   ( Updated:2021-08-05 00:07:38.0  )
భర్త నిజస్వరూపాన్ని బయటపెట్టిన నటి.. వేరే గదిలో ప్రియురాలితో
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమలో గృహహింస కేసులు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. నిన్ననే బాలీవుడ్ సింగర్ యోయో హాని సింగ్ తనను లైంగింకంగా వేధిస్తున్నాడని అతని భార్య గృహహింస కేసు పెట్టిన విషయం మరువకముందే.. మరో హిందీ నటి తన భర్త వేధిస్తున్నాడని తెలుపుతూ గృహహింస కేసు పెట్టడం బాలీవుడ్ లో సంచలనంగా మారింది. ‘బాగ్బాన్‌’, ‘నాగిని 2’ సీరియళ్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హిందీ నటి అర్జూ గోవిత్రికర్‌ తన భర్త సిద్ధార్థ్‌ శబర్వాల్‌ నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధమైంది. తన భర్త పెట్టే హింసలను, వేధింపులను తట్టుకోలేకపోతున్నానని, అతని నుంచి తనను కాపాడాలంటూ పోలీసులను ఆశ్రయించింది.

ఈ విషయమై అర్జూ గోవిత్రికర్‌ మాట్లాడుతూ ” తనను ఎంతో ప్రేమించాను.. పెళ్లి అయిన తర్వాత అతడి నిజ స్వరూపం బయటపడింది. ఎంతో ప్రయత్నించి చూశాను కానీ సిద్దార్థ్‌తో కలిసుండటం సాధ్యపడదు అనిపిస్తోంది. మా మధ్య పెరుగుతున్న దూరం గురించి నేనెప్పుడూ మీడియాతో మాట్లాడలేదు. కానీ ఈరోజు మాట్లాడి తీరతాను. తనతో నేను ఎంత కలిసి ఉండాలని చూసినా.. అతను మాత్రం నన్ను మెడ పట్టుకుని ఇంట్లోంచి బయటకు గెంటేయడానికి ప్రయత్నించాడు. కులం పేరు చెప్పి తిడుతూ ఎప్పుడు చేయి చేసుకొనేవాడు.. కట్టుకున్నదాన్ని అని చూడకుండా కడుపులో తన్ని.. శారీరకంగా హింసించేవాడు.

మాకు పిల్లలు పుట్టాకయినా అతడు మారతాడు అనుకున్నా.. కానీ, కొడుకు పుట్టాకా వేరే గదిలో పడుకోవడం మొదలు పెట్టాడు. ఆ రూమ్ లో తన రష్యన్ ప్రియురాలితో చాటింగ్ చేస్తూ గడిపేవాడు. అదే సమయంలో అతడిని నిలదీశాను. కానీ, నాకు నిరాశే మిగిలింది. ఇక అతనిని భరించలేను.. అందుకే విడాకులు అడుగుతున్నాను.. అతడి చాటింగ్‌, నా మీద దాడి చేసిన దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు నా దగ్గర ఉన్నాయి. ఈ ఆధారాలే నాకు న్యాయం చేస్తాయని నమ్ముతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

భార్య అర్జూ ఆరోపణలపై సిద్ధార్థ్‌ శబర్వాల్‌ స్పందించాడు. ” ఆమె ఏం మాట్లాడుతుందో తెలియడం లేదు. ఆమె ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోంది. ఆమె ఏం చెప్పాలంటే అది చెప్పుకోనివ్వండి.. ఈ విషయంలో నేనేమి మాట్లాడదలుచుకోలేదు” అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story