ఇక ఆ రాష్ట్రంలో గంజాయి పెంపకం.. అఫీషియల్‌!

by Shamantha N |
ఇక ఆ రాష్ట్రంలో గంజాయి పెంపకం.. అఫీషియల్‌!
X

దిశ, ఫీచర్స్ : యువతను మత్తులో ముంచుతున్న గంజాయి సప్లైపై ప్రభుత్వాలు నిషేధం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు మత్తు పదార్థాల తయారీకి మూలమైన గంజాయి మొక్కల పెంపకంపై పోలీసు శాఖ ఉక్కుపాదం మోపుతోంది. అయితే భారత్‌తోని ఓ రాష్ట్రంలో గంజాయి పెంపకాన్ని చట్టబద్ధం చేయబోతున్నారనే వార్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

తమ రాష్ట్రంలో గంజాయి పెంపకాన్ని లీగలైజ్ చేసేందుకు కొత్త పాలసీ తీసుకొస్తున్నట్లు ఇటీవల హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ ప్రకటించారు. ఈ మేరకు గంజాయి, జనపనార పెంపకంపై ప్రభుత్వం దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. అయితే మెడిసినల్ పర్పస్, ఫ్యాబ్రిక్స్ కోసమే వీటి పెంపకాన్ని ప్రోత్సహించనున్నట్టు సీఎం క్లారిటీనిచ్చారు. కాగా హిమాచల్ ప్రదేశ్‌లో పెరిగే గంజాయి ప్రపంచంలోనే బెస్ట్ క్వాలిటీదని అధికారులు చెబుతుండగా, అక్కడ పండించే జనపనార కూడా ప్రాచీన సంప్రదాయ సంపదగా గుర్తింపు పొందింది. స్థానిక తెగలు ఈ జనపనార ఉత్పత్తులను చెప్పులు, మ్యాట్స్, రోప్స్‌తో పాటు ఫుడ్ ఐటమ్స్ తయారీలోనూ ఉపయోగిస్తారు. ఇక థాయ్‌లాండ్‌ ప్రజలు గంజాయి ఆకులను వంటకాల్లో వాడుతుండగా.. వీటి వల్ల హెల్త్‌కు కలిగే ప్రయోజనాల కోసమని గంజాయి వాడకాన్ని అక్కడ లీగలైజ్ చేశారట.

Advertisement

Next Story

Most Viewed