- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎత్తుకు పైఎత్తు.. ‘గెల్లు’కు చెక్ పెట్టేందుకు బీజేపీ భారీ వ్యూహం..?
దిశ ప్రతినిధి, కరీంనగర్: కులాల వారీగా సమీకరణాలు జరుపుతూ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు పడుతున్న పాట్లు అన్ని ఇన్నీ కావు. హుజురాబాద్ వేదికగా ఆయా కులాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీలు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాయి. తాజాగా బీజేపీ మరో భారీ స్కెచ్‌కు రంగం సిద్దం చేసింది. అధికార టీఆర్ఎస్ పార్టీ యాదవ సామాజిక వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గొల్ల, కుర్మలను మచ్చిక చేసుకునేందుకు ఈటల కూడా తన వ్యూహాలకు పదునుపెట్టారు.
ఇప్పటికే యాదవులతో సమావేశమైన ఈటల రాజేందర్ యాదవుల ఓట్లను చీల్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా బీజేపీ నాయకత్వం మరో అడుగు ముందుకేసి కీలక నిర్ణయం తీసుకుంది. హర్యానా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బండారు దత్తాత్రేయను రంగంలోకి దింపాలని భావించింది. ఈ మేరకు ఈ నెల 26న బండారు దత్తాత్రేయకు ఆత్మీయ సత్కారం కార్యక్రమాన్ని జమ్మికుంటలో ఏర్పాటు చేస్తున్నట్టు మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ తెలిపారు. పార్టీలకు అతీతంగా గొల్ల కుర్మలంతా కూడా ఈ కార్యక్రమానికి రావాలని ఆమె కోరారు. అయితే, రాజ్యంగ బద్దమైన పదవిలో కొనసాగుతున్న దత్తన్న కుల సంఘాల సమావేశాలకు రావడం సరైందేనా అన్న చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.