- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా !
దిశ, వెబ్‌డెస్క్: స్వరాష్ట్రానికి వస్తున్న వలస కూలీలతో బీహార్ బెంబేలెత్తుతున్నది. కార్మికులతోపాటు కరోనా కూడా వలస వస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నది. రాష్ట్రానికి తిరిగివచ్చిన కూలీలను పరీక్షించగా.. దేశ సగటు కంటే అధికంగా పాజిటివ్ రేటు వెలుగుచూడటం రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నది. వలస కూలీలతోపాటు కరోనా ప్రవేశించడమే కాదు.. అసలు లక్షణాలు బయటపడని కూలీలతోనూ పెను సవాలును ఎదుర్కొంటున్నది. మే 18 నాటికి 8,337 మంది వలస కూలీల శాంపిళ్లను పరీక్షించగా.. అందులో 8శాతం మందికి కరోనా పాజిటివ్ తేలింది. దేశ సగటు పాజిటివ్ రేటు(4శాతం)కు రెట్టింపుగా నమోదవడం గమనార్హం. దేశరాజధాని ఢిల్లీ నుంచి వచ్చిన కూలీల్లో ఈ రేటు అధికంగా ఉన్నది. ఢిల్లీ నుంచి వచ్చిన 835 మంది వలస కూలీలను పరీక్షించగా.. అందులో 218 మందికి పాజిటివ్ తేలింది. అంటే పరీక్షించిన ప్రతి నలుగురిలో ఒక్కరికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. అంటే పాజిటివిటీ రేటు 26శాతంగా నమోదైంది. కానీ, ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 7శాతంగానే ఉన్నట్టు ప్రభుత్వం చెబుతున్నది. ఈ ధోరణే.. ఢిల్లీ మరింత కట్టుదిట్టంగా కరోనాపై పోరాడాల్సిన అవసరమున్నదని సంకేతాలనిస్తున్నది. బెంగాల్, హర్యానానుంచి వచ్చిన కూలీల్లోనూ ఇదే తీరు కనిపించింది. కాగా, మరికొన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల్లో పాజిటివిటీ రేటు.. ఆయా రాష్ట్రాల్లోని పాజిటివిటీ రేటుకు దాదాపు సమానంగా ఉండటం గమనార్హం.