వరుస ఏసీబీ దాడులతో పోలీసుల అలర్ట్..

by Sridhar Babu |
police-department
X

దిశప్రతినిధి, కరీంనగర్ : లంచం అడగకండి.. తీసుకోకండి.. ఏసీబీ డేగ కళ్లతో చూస్తోంది జాగ్రత్త అంటూ పోలీసు అధికారులు సిబ్బందిని అలెర్ట్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో జగిత్యాలలో ఎస్సై, కరీంనగర్ జిల్లా గంగాధరలో ఏఎస్ఐ ఏసీబీకి పట్టుబడడంతో పోలీసులను వారి పై అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. కరప్షన్‌కు పాల్పడి ఏసీబీకి చిక్కి జీవితాలను బుగ్గిపాలు చేసుకోవద్దంటూ హితవు పలికారు. ఈ మేరకు ఆయా స్టేషన్లలో మౌఖిక ఆదేశాలు జారీ చేసిన పోలీసు ఉన్నతాధికారులు సంబంధిత ఠాణాల్లో పని చేస్తున్న వారికి గట్టిగా చెప్పాలని సూచించినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లాలోని అన్ని స్టేషన్ల సిబ్బందికి ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఏసీబీ కేసులో ఇరుక్కుంటే ఇబ్బందులు పడతారని, ముఖ్యంగా స్టేషన్లలో నోటీసులు ఇచ్చి పంపించే కేసుల్లో నిందితుల వద్ద అసలే డబ్బులు అడగవద్దని చెప్పారు. సివిల్ పంచాయితీల్లో కూడా తల దూర్చవద్దని ఆదేశాలు వచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed