ఓటరు నమోదుకు పీఎఫ్ తప్పనిసరి కాదు : హైకోర్టు

by srinivas |
ఓటరు నమోదుకు పీఎఫ్ తప్పనిసరి కాదు : హైకోర్టు
X

దిశ, ఏపీబ్యూరో : కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదుకు సంబంధించి శుక్రవారం హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ప్రైవేటు అధ్యాపకులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరుగా నమోదు అయ్యేందుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న పీఎఫ్​ సభ్యత్వం తప్పనిసరి అని ఉన్న నిబంధనను తొలగిస్తూ ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించిన పలు కీలక అంశాలపై జస్టిస్ వి.శేషసాయి నేతృత్వంలోని రాష్ట్ర హైకోర్ట్ సింగిల్ బెంచ్ ఆదేశాలను వెలువరించింది.

ప్రైవేటు పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోట సాయికృష్ణ ఆ నిబంధనను తొలగించడంతో పాటు ఓటరు నమోదు ప్రక్రియను పొడిగించాల్సిందిగా హైకోర్టులో వేసిన రిట్‌ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​ను హైకోర్టు విచారించింది. ఓటరు నమోదు ప్రక్రియలో పీఎఫ్​నిబంధన తప్పనిసరి అంశాన్ని తొలగించాలని ఆదేశాలు జారీచేసింది.

Advertisement

Next Story

Most Viewed