ఒక్క సెకనులో.. 1000 హెచ్‌డీ సినిమాలు

by Harish |
ఒక్క సెకనులో.. 1000 హెచ్‌డీ సినిమాలు
X

మీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంత? అని అడిగితే 2 ఎంబీపీఎస్, 2 జీబీపీఎస్ అని చెప్పడం పాత పద్ధతి. గంటలో రెండు సినిమాలు డౌన్‌లోడ్ అవుతాయి అని చెప్పడం కొత్త పద్ధతి. ఈ కొత్త లెక్క ప్రకారం చూస్తే ఒక్క సెకనులో 1,000 హెచ్‌డీ సినిమాలు డౌన్‌లోడ్ చేయగల ఇంటర్నెట్‌ను పరిశోధకులు పరీక్షించి, రికార్డు చేశారు. మొనాష్, స్విన్‌బర్న్, ఆర్ఎంఐటీ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని నిరూపించారు. ఇదే ఆస్ట్రేలియాలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ అని, రానున్న కాలంలో ఇది ప్రపంచాన్ని మరింత వేగంగా మారుస్తుందని వాళ్లు అంటున్నారు.

ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ ఆధారంగా పనిచేస్తుండటం, కొవిడ్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వసాధారణం అవుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ వేగం కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ ద్వారా దాదాపు 1.8 మిలియన్ కుటుంబాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించవచ్చని ప్రొఫెసర్ డేవిడ్ మోస్ అన్నారు. వారి పరిశోధనలో 44.2 టెరాబైట్స్ వేగాన్ని విజయవంతంగా సాధించినట్లు ఆయన అన్నారు. ప్రస్తుతానికి ల్యాబ్‌కు మాత్రమే ఈ వేగాన్ని పరిమితం చేయగా.. దీన్ని సాధించేందుకు తాము 80 లేజర్ల శక్తిని అందించగల మైక్రో కొంబ్ అనే ప్రత్యేక పరికరాన్ని తయారు చేసినట్లు డేవిడ్ చెప్పారు. ఇప్పుడు వాడుతున్న అన్ని రకాల టెలీకమ్యూనికేషన్స్ పరికరాలతో పోల్చితే ఇది చాలా చిన్నది, తేలికైనదని వివరించారు. ఈ సింగిల్ ఆప్టికల్ చిప్ ద్వారా ఇంత వేగాన్ని సాధించడం ఆనందంగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed