గాంధీ ఆసుపత్రిలో మూడంచెల భద్రత

by vinod kumar |   ( Updated:2020-04-02 23:27:44.0  )
గాంధీ ఆసుపత్రిలో మూడంచెల భద్రత
X

దిశ, న్యూస్ బ్యూరో:

హైదరాబాద్ గాంధీ హాస్పిటల్‌లో డాక్టర్లపై కరోనా వైరస్ పేషెంట్, అతని బంధువులు దాడి ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటం కోసం మూడంచెల పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది. హాస్పిటల్‌లో ఫ్లోర్‌కు ఒక ఎస్‌ఐని ఇన్‌ఛార్జిగా, నాలుగు ఫోర్లకు నలుగుర్ని నియమించారు. వీరి పర్యవేక్షణ కోసం సీఐను నియమించారు. హాస్పిటల్ గేటు దగ్గర ఇద్దరు సీఐల ఆధ్వర్యంలో రాకపోకలను పర్యవేక్షించనున్నారు. భద్రతపై రోజువారీగా ఇద్దరు చొప్పున అదనపు డీసీపీలు, అసిస్టెంట్ సీపీలు సమీక్షించనున్నారు. 200 మంది సిబ్బంది గాంధీ హాస్పిటల్‌లో బందోబస్తులో ఉంటారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, వైద్యులు, సిబ్బంది ఆందోళన పడాల్సిన అవసరం లేదని నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్ తెలిపారు.

Tags: Telangana, Gandhi Hospital, Corona, Police, Protection, Positive Patients

Advertisement

Next Story

Most Viewed