బోర్దర్ ఇష్యూపై అత్యున్నత స్థాయి సమావేశం..

by Shamantha N |
బోర్దర్ ఇష్యూపై అత్యున్నత స్థాయి సమావేశం..
X

దిశ, వెబ్‌డెస్క్ :

సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల పరిష్కారానికి ఇండియా, చైనా దేశాలు మరోసారి చర్చలకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఢిల్లీ వేదికగా అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో పాటు, విదేశాంగశాఖ మంత్రి జైశంకర్, త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ హాజరయ్యారు.

తూర్పు లద్దాక్‌లోని భద్రతా పరిస్థితులతో పాటు కమాండర్ల భేటీలో పాటించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా, ఇరుదేశాల మధ్య చివరిసారిగా సెప్టెంబర్ 21న మిలిటరీ స్థాయి చర్చలు జరగగా అందులో ఎలాంటి పురోగతి లేదని రక్షణ వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story

Most Viewed