- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వానికి, ప్రధాన కార్యదర్శికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇప్పటివరకు వివిధ కోర్టుల్లో దాఖలైన ధిక్కరణ కేసుల విచారణకు 2021-22 సంవత్సరానికి రూ. 58.95 కోట్లను మంజూరు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాక తప్పుపట్టింది. నిధుల విడుదలకు పరిపాలనాపరమైన అనుమతులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలుపై హైకోర్టు స్టే విధించింది. ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు వ్యక్తిగత హోదాలో నోటీసులు జారీ చేసి అక్టోబరు 27వ తేదీ వరకు నిధులను విడుదల చేయవద్దంటూ స్టే విధించింది. సీఎస్‌తో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, రెవిన్యూ శాఖ, సీసీఎల్ఏ ల పర్యవేక్షణ చూస్తున్న ప్రధాన కార్యదర్శికి కూడా నోటీసులు జారీ చేసింది. ట్రెజరీ విభాగం డైరెక్టర్‌కు కూడా నోటీసులు ఇచ్చింది.
కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారుల ఖర్చుల నిమిత్తం రూ. 58 కోట్లకుపైగా నిధులను మంజూరు చేయడానికి ట్రెజరీ నిబంధనలు ఎలా అనుమతించాయంటూ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదిని ప్రశ్నించింది. ఇన్ని కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఏ పద్ధతిలో ఖర్చు చేస్తారని ప్రశ్నించింది. హైకోర్టు తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు రసూ. 58.95 కోట్లను విడుదల చేయవద్దని స్పష్టం చేసి తదుపరి విచారణను అక్టోబరు 27వ తేదీకి వాయిదా వేసింది.