హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి

by Shyam |
హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి
X

– తెలంగాణ పెన్షనర్స్ జేఏసీ డిమాండ్

దిశ, తెలంగాణ బ్యూరో: కోత విధించిన పెన్షన్ మొత్తాన్ని ఒకే విడతలో చెల్లించాలన్ని హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. కొవిడ్ నేపథ్యంలో కోత విధించిన పెన్సన్‌ను రెండు వాయిదాల్లో చెల్లించేందుకు ప్రభుత్వం గురువారం జీఓను విడుదల చేసింది. కొవిడ్ కారణంగా పెన్సనర్లు, కుటుంబాలు అనేక ఇబ్బందులు పడ్డాయని, కోర్టు కూడా వారి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి సూచన చేసిందని జేఏసీ ఛైర్మన్ లక్ష్మయ్య, కో ఛైర్మన్ రాజేంద్ర బాబు గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో గుర్తు చేశారు. కోత విధించిన మొత్తాన్ని 12 శాతం వడ్డీతో చెల్లించాలని వారు కోరారు

Advertisement

Next Story

Most Viewed