మరియమ్మ లాకప్ డెత్‌పై హైకోర్టు సీరియస్.. సీబీఐకి అప్పగించాలంటూ..

by Shyam |
High Court
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసుపై బుధవారం హైకోర్టు విచారించింది. దీనిపై ఏజీ వాదిస్తూ.. మరియమ్మ అనారోగ్య సమస్యలతోనే చనిపోయిందని, ఆమె కుటుంబానికి పరిహారం కూడా చెల్లించామని కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా ఎస్ఐ, కానిస్టేబుల్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఆయన వివరించారు. ఏజీ వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు.. మరియమ్మ లాకప్ డెత్ కేసును స్వతంత్ర సంస్థ అయిన సీబీఐకి అప్పగించాలని అభిప్రాయపడింది.

రెండు పోస్టుమార్టం నివేదికల్లోనూ మరియమ్మ పై గాయాలున్నాయని, గుండె ఆగిపోయేలా ఎవరైనా కొడతారా? అంటూ కోర్టు ప్రశ్నించింది. కుటుంబానికి ఇచ్చిన పరిహారం ప్రాణం తీసుకురాలేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేస్తూ.. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కు అప్పగించాలని ఏజీని ఆదేశించింది. అంతేకాకుండా సీబీఐ ఎస్పీ ఈ నెల 22న హైకోర్టు విచారణకు హాజరవుకావాలని ఆదేశించింది.

Advertisement

Next Story