సంపూర్ణ లాక్‌డౌన్‌పై పిల్‌ను కొట్టేసిన హైకోర్టు

by Shyam |
High court
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. జూన్ 15 వరకూ సంపూర్ణ లాక్‌డౌన్ విధించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సామాజిక కార్యకర్త సునితా కృష్ణణ్ పిల్ దాఖలు చేశారు. లాక్‌డౌన్ సడలించి ప్రార్థనా మందిరాలను తెరవడం వలన కరోనా తీవ్రత పెరుగుతందని తన పిటీషన్‌లో పేర్కొన్నారు. అయితే లాక్‌డౌన్ ప్రభుత్వ పరమైన నిర్ణయమని, తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఎత్తివేశారని హైకోర్టు గుర్తు చేసింది. కరోనా పరిస్థితుల్లో ప్రార్థన మందిరాలకు వెళ్లాలా వద్దా అనేది ప్రజల ఇష్టమని తెలిపిన కోర్టు పిటీషన్‌ను కొట్టివేసింది.

Advertisement

Next Story