- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుట్కా, జరదా, పాన్‌మసాలా ప్రాణాలకు హానికరం.. హైకోర్టు కీలక కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో గుట్కాను నిషేధించినప్పటికీ దొంగచాటున అమ్మకాలు జరుగుతూనే ఉంటున్నాయి. గుట్కాకి బానిసై క్యాన్సర్ బారినపడి చనిపోతున్న కేసులు పెరుగుతుండటంతో నిషేధం విధించారు. ఈ క్రమంలో అమ్మకపుదారులు పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి స్మగ్లింగ్ చేస్తూ పెద్ద ఎత్తున హైదరాబాద్‌లో దాచిపెడుతున్నారు. ఈ క్రమంలో భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకుంటున్నారు. దుకాణదారులపై కేసులు పెట్టినా తిరిగి ఇదే దందా కొనసాగిస్తున్నారు. దీంతో గుట్కా మరణాలను తగ్గించలేకపోతున్నారు. కేవలం హైదరాబాద్‌లోనే ఏటా రూ.350 కోట్ల గుట్కా వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా గుట్కాను ఎందుకు నిషేధించారని.. సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో 160 పిటిషన్లు వేయగా.. వీటిపై కోర్టు విచారణ జరిపింది. ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తోన్న గుట్కా, పాన్ మసాలాలను ప్రభుత్వం నిషేధించడాన్ని కోర్టు సమర్థించింది. గుట్కా తిని చనిపోతున్న వారి కంటే కరోనాతో చనిపోయిన వారే తక్కువగా ఉన్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో గుట్కా నిషేధంపై దాఖలైన 160 పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.