డీజీపీ రిజైన్ చేయాలి.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

by Anukaran |   ( Updated:2020-09-14 04:54:18.0  )
డీజీపీ రిజైన్ చేయాలి.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డీజీపీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ గాడి తప్పుతోందన్న ధర్మాసనం.. రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని మండిపడింది. పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయకుంటే డీజీపీ రాజీనామా చేయాలని వ్యాఖ్యానించింది. గతంలో డీజీపీని పలుసార్లు కోర్టుకు పిలిచినా మార్పురాలేదని స్పష్టం చేసింది. ప్రతిసారి ఇలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని, అన్ని కేసులకు సీబీఐ విచారణ సాధ్యం కాదని అభిప్రాయపడింది. అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యం కాగా అతని మేనమామ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. గతంలో మూడుసార్లు జ్యుడిషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.

Read Also…

అన్నీ వదిలేసి చిందులేసిన వైసీపీ ఎమ్మెల్యే

Advertisement

Next Story

Most Viewed