నల్లగొండ‌లో హై అలర్ట్

by vinod kumar |   ( Updated:2020-04-06 01:13:42.0  )
నల్లగొండ‌లో హై అలర్ట్
X

దిశ, నల్లగొండ: ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన జిల్లాకు చెందిన
ఎనిమిది మందితోపాటు వారి కుటుంబ సభ్యులు నలుగురికి కరోనా సోకడంతో అధికారులు నల్లగొండలో హై అలర్ట్ ప్రకటించారు. పట్టణంలోని మన్యం చల్కా, రహమత్‌బాగ్ నగర్, మీర్‌బాగ్ కాలనీ, బర్కత్‌పురకు చెందిన ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారి కుటుంబ సభ్యులైన 39 మందిని ఐసోలేషన్‌కు తరలించారు. ఇందులో నలుగురికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వీరు సుమారు 1200 మందితో ప్రైమరీ కాంటాక్ట్ అయినట్లు అధికారులు గుర్తించారు. వీరందరికీ ఒకేసారి రక్త పరీక్షలు చేయడం సాధ్యం కాకపోవడంతో స్క్రీనింగ్ చేసి క్వారంటైన్‌కు తరలించారు.
మిర్యాలగూడ మండలం సీతారాంపురంలో ఒక మహిళకు పాజిటివ్ వచ్చింది. ఆమె 45 మందిని కలిసినట్టు అధికారులు గుర్తించారు. కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. దామరచర్ల సంబంధించిన మరో మహిళకు కూడా పాజిటివ్ రావడంతో ఆమె కుటుంబ సభ్యులను ఇప్పటికే క్వారంటైన్ తరలించారు. మర్కజ్ నుంచి వచ్చిన తర్వాత సదరు మహిళ మెడిసిన్ కోసం మెడికల్ షాపుకు వెళ్లినట్లు సమాచారం. మర్కజ్‌కి వెళ్లి వచ్చిన వారితో ప్రైమరీ కాంటాక్ట్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా జిల్లాలో హై అలర్ట్‌గా ప్రకటించారు. మిర్యాలగూడ, నల్లగొండ, దామరచర్ల ఐసొలేషన్ కేంద్రంలో ఉన్న 52 మందికి జియో ట్యాగింగ్ చేశారు.

Tags: carona, nallagonda, high alert, ts news

Advertisement

Next Story

Most Viewed