నానికి తెలిసిన చిరు సినిమా రహస్యాలు.. త్వరలో…

by Jakkula Samataha |
నానికి తెలిసిన చిరు సినిమా రహస్యాలు.. త్వరలో…
X

జగదేక వీరుడు అతిలోక సుందరి… దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన అపురూప దృశ్య కావ్యం. వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో జగదేక వీరుడిగా మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరిగా శ్రీదేవి నటించారు. తెలుగు తెరపై సరికొత్త అధ్యాయానికి తెరలేపిన ఈ సినిమా విడుదలై మే 9 నాటికి 30 ఏళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో అలాగే నిలిచిపోయింది.

ఈ సందర్భంగా సినిమా గురించి సరికొత్త రహస్యాలను ప్రేక్షకులకు తెలిపేందుకు నిర్ణయించింది వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ. ఇందుకోసం నేచురల్ స్టార్ నానిని ఎందుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

చారిత్రాత్మక చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి గురించి తెలుసుకోవాలని ఆతృతగా, సంతోషంగా ఉందా? అయితే మే 5,7,9 తేదీల్లో ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త హిడ్డెన్ స్టోరీస్ తో నాని మీముందుకు వస్తారు అని తెలిపింది. ఈ సినిమా విడుదలై ఈ నెల 9కి 30 ఏళ్లు కానుండగా… ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపింది. సో.. గెట్ రెడీ మెగా ఫ్యాన్స్… నేచురల్ స్టార్ నోట.. మెగాస్టార్ సినిమా మాట. జగదేక వీరుడు అతిలోక సుందరి రహస్య కథలను చెప్పేందుకు నాని కూడా చాలా ఎగ్జైటింగా ఉండగా… ప్రేక్షకులు అంతకు మించిన ఉత్సాహంతో ఎదురుచూస్తున్నట్లు చెప్తున్నారు.

Tags: Chiranjeevi, Sri Devi, Vyjayanthi Movies, Nani, Raghavendra Rao, 30 Years

Next Story

Most Viewed