- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
దిశ ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో మహారాష్ట్ర రైతుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద బీజేపీ గడ్జిరోలి జిల్లా ప్రధాన కార్యదర్శి సందీప్ కోరేట్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది రైతులు నిరసన చేపట్టారు. బ్యారేజ్‌పై నుండి గత కొంతకాలంగా రాకపోకలు నిలిపివేయడంతో పొరుగునే ఉన్న గ్రామాలవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతులు వాపోతున్నారు.
మేడిగడ్డ బ్యారేజ్‌పై రాకపోకలు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా బ్యారేజ్ బ్యాక్ వాటర్ కారణంగా పొరుగునే ఉన్న పలు గ్రామాలకు చెందిన పంట భూములు కోతకు గురవుతున్నాయని మహారాష్ట్ర రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ముంపునకు గురి కాని ప్రాంతంలో సాగు చేసినా పంటలు నాశనం అవుతున్నాయని వాపోయారు. తమకు న్యాయం చేసే వరకూ మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నుండి కదిలేది లేదని రైతాంగం స్పష్టం చేస్తోంది. కాటారం డీఎస్పీ బోనాల కిషన్ మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మహారాష్ట్ర రైతులతో మాట్లాడి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారు ఆదేశాల మేరకే తాము రాకపోకలను నిలిపివేయాల్సి వచ్చిందని సరిహద్దు గ్రామాల రైతుల డిమాండ్‌ను వారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.