రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ కావాలంటే ఇలా చేయండి.

by Shyam |   ( Updated:2021-04-20 23:57:29.0  )
రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ కావాలంటే ఇలా చేయండి.
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా సెకండ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతుంది. కరోనా బారిన రోగులకు ఇంజక్షన్ చేయాల్సిన రెమ్‌డెసివిర్‌ మార్కెట్ లో అందుబాటులో లేక రోగుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల హెటిరో కంపెనీ రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ను ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే అందించాలని నిర్ణయించారు. ఇటీవల కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద హెటిరో కంపెనీ ఓ స్టాల్ ను ఏర్పాటు చేసిన రెమ్‌డెసివిర్‌ డ్రగ్ ను విక్రయించగా అక్కడ జనాలు బారులు తీరి తీవ్ర ఉదృక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హెటిరో కంపెనీ గేటు ముందు రెమ్‌డెసివిర్‌ కేవలం వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా మాత్రమే అందిస్తామని ఓ బోర్డును కూడా ఏర్పాటు చేశారు.

ఇలా మెసేజ్ చెయ్యాలి..
హెటిరో రెమ్‌డెసివిర్ కావాల్సిన వారు నగరం పేరు, ఆస్పత్రి పేరు, ఐపీ నంబర్, రోగి పేరు, అటెండర్‌ పేరు, మొబైల్‌ నంబర్, ఇంజక్షన్ల సంఖ్య వివరాలను మొబైల్‌ నంబర్‌ 91338 96969కు వాట్సాప్‌ గానీ, మెసేజ్‌గానీ పంపించాలని , మందును ఎప్పుడు అందజేస్తామో వారి ఫోన్‌కే మెసేజ్‌ వస్తుందని అప్పుడు మాత్రమే వచ్చి తీసుకెళ్లాలని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed