నేషనల్ క్రష్.. ప్యాంటు వేసుకోవడం మర్చిపోయావా..?

by Shyam |   ( Updated:2021-07-24 07:25:36.0  )
నేషనల్ క్రష్.. ప్యాంటు వేసుకోవడం మర్చిపోయావా..?
X

దిశ, వెబ్‌డెస్క్: రోమ్ లో రోమన్ లా ఉండాలంటారు. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అదే పని చేస్తున్నట్లుంది. ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ లో పాగా వేయడానికి చాలానే కష్టపడుతోంది. ఇప్పటికే రెండు భారీ ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టిన ఈ బ్యూటీ ఆ షూటింగ్ ల కోసం ముంబైలోనే ఎక్కువ సమయం గడుపుతోంది. ఇక ముంబై అంటే ఫ్యాషన్ రంగానికి కేరాఫ్ అడ్రెస్స్. అక్కడ హీరోయిన్లను తట్టుకోవాలంటే ఎక్కడి నుంచి వచ్చే వాళ్లయినా వారికి ధీటుగా ఉండాలి. ప్రస్తుతం రష్మిక కూడా వారికి ధీటుగా ఉండడానికే ప్రయత్నిస్తున్నది.

చిట్టి పొట్టి నిక్కర్లతో ముంబై వీధుల్లో తిరుగుతూ కెమెరా కంట పడింది. ఇప్పటికే జిమ్ కి వెళ్ళేటప్పుడు చిన్న షాట్స్ లో దర్శనమిచ్చి నెటిజన్ల ట్రోల్స్ కు గురైన బ్యూటీ ఇప్పుడు ముంబై ఎయిర్ పోర్ట్ లో మరో చిట్టి నిక్కరుతో కనిపించి షాక్ ఇచ్చింది. ఎల్లో కలర్ స్లీవ్ లెస్ స్వేట్టర్ టీ షర్ట్ ధరించి, కూల్ బ్లాక్ గాగుల్స్, బ్లాక్ క్యాప్, బ్లాక్ మాస్క్ తో స్టైలిష్ లుక్ లో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారగా.. ఈ ఫోటోలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కిందా ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా..? అని ట్రోల్స్ చేస్తున్నారు. ఎంత ముంబై వెళ్లినా ఇక్కడ పద్దతులను మర్చిపోకూడదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం రష్మిక తెలుగులో అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’లో , శర్వానంద్ సరసన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలో నటిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed