రకుల్ ప్రీతిసింగ్.. ట్వీన్స్ అంటా

by Shyam |
రకుల్ ప్రీతిసింగ్.. ట్వీన్స్ అంటా
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ విస్తృత వ్యాప్తికి విధించిన, లాక్ డౌన్ మూలంగా దేశ వ్యాప్తంగా అన్ని థియెటర్లు మూత పడటంతో స్ట్రీమింగ్ మీడియాకు ఇప్పుడు ప్రాధాన్యత పెరిగిపోతోంది. దాంతో ఓటీటీ ప్లేయర్స్ వైవిధ్యమైన కంటెంట్ కోసం చూస్తున్నాయి. రోటీన్‌గా కాకుండా ఏదైనా కొత్త కంటెంట్ వస్తే భారీ మొత్తాలు వెచ్చించి తీసుకుంటున్నాయి. ఇటీవల కీర్తి సురేశ్ నటించిన పెంగ్విన్ చిత్రం కూడా ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌పైనే విడుదలైన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకులు సైతం ఈ డిజిటల్ వేదికకు రావడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే కాజల్, సమంత, తమన్నా వంటి తారలు వెబ్ సీరీస్ లలో నటిస్తూ అక్కడ కూడా తమదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ కూడా వెబ్ సీరీస్ వైపు వస్తోంది. తాజాగా ఆమె ఓ వెబ్ సీరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

విశేషం ఏమిటంటే, ఇందులో తొలిసారిగా ఆమె ద్విపాత్రాభినయం చేస్తుందనీ, అది కూడా కవలలుగా నటిస్తుందనీ తెలుస్తోంది. ఈ ట్విన్స్ ప్రతి విషయంలోనూ ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారనీ, ఆ వైనం ఆసక్తికరంగా సాగుతుందనీ చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed