కుక్కను వెతికి తెస్తే లక్ష ఇస్తానంటున్న నటి.. పోస్ట్ వైరల్

by Shyam |   ( Updated:2021-05-12 23:00:51.0  )
కుక్కను వెతికి తెస్తే లక్ష ఇస్తానంటున్న నటి.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: సెలబ్రెటీలు ఎక్కువగా జంతు ప్రేమికులని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోను హీరోయిన్లు ఐతే ఎప్పుడు తమ పెట్ డాగ్ నో, పెట్ క్యాట్ నో వెంటేసుకొని వాకింగ్, ఫోటో షూట్స్ అంటూ తిరుగుతూ ఉంటారు. ఇక షూటింగ్స్ కి వేరే ప్రదేశాలు వెళ్ళినప్పుడు ఐ మిస్ మై పెట్స్ అంటూ పోస్ట్లు కూడా పెడుతుంటారు. ఇక అవి కనిపించకుండా పొతే మాత్రం వారి ప్రాణం పోతుందనే చెప్పాలి. ప్రస్తుతం ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా అదే పరిస్థితిలో ఉన్నట్లు కనిపిస్తుంది. నిధి తాజాగా ఇన్స్టాలో కుక్క తప్పిపోయింది.. అంటూ ఓ పోస్ట్ పెట్టింది. “ఈ కుక్క పేరు కోకో.. ఇది తప్పిపోయింది.. వెతికి తెచ్చినవారికి లక్ష రూపాయలు రివార్డు” అంటూ తెలుపుతూ కాంటాక్ట్ డిటైల్స్ కూడా తెలిపింది. అయితే ఆ కుక్క తనదా..? లేక ఎవరైనా తెలిసినవాళ్లదా..? అనేది నిధి సమాచారం ఇవ్వలేదు. దీంతో నెటిజన్స్ కేవలం ఒక కుక్కను పట్టిస్తే లక్ష రూపాయాలు ఇవ్వడం ఏంటీ? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం నిధి పవన్ కళ్యాణ్ ‘హరిహర వీర మల్లు’ చిత్రంలో నటిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed