ఎవరికీ బానిసను కాదు.. ఊడిగం చేయను

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నేత, సినీ నటి మాధవీలత ఫేస్‌బుక్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, ఎవరికీ బానిసను కాదు.. ఊడిగం చేయనని పేర్కొన్నారు. పార్టీ ఎప్పటికీ మంచిదేనని.. కానీ మనషులే మంచొళ్లు కాదంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. ఉన్నట్టుండి హీరోయిన్ ఫేస్‌బుక్‌ ఈ వ్యాఖ్యలు చేయడం బీజేపీలో శ్రేణుల్లో చర్చకు దారి తీసింది.

సుమారు రెండేళ్ల కింద బీజేపీలో చేరిన మాధవీలత కీలక సమయాల్లో పోస్టులు పెడుతూ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. అయితే ఒక్కసారిగా ఎందుకు ఇలాంటి పోస్టులు పెట్టిందనేది రాజకీయ నేతలతో పాటు పార్టీ శ్రేణుల్లో చర్చకు తెరదీసింది. ఎవరికీ బానిసను కాదు.. ఊడిగం చేయనని.. పెద్ద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ శ్రేణులతో ఏదో వివాదం జరిగి ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు.

Advertisement