- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తనయుల కోసం హీరోల బెంగ
కరోనా వల్ల ఏర్పడిన క్లిష్ట పరిస్థితులు హీరోలను సైతం భయపెడుతున్నాయి. తమకు దూరంగా ఉన్న పిల్లల కోసం దిగులు చెందేలా చేస్తున్నాయి. చదువుల కోసం వెళ్లి తమకు దూరంగా వేరే ప్రదేశాల్లో ఉండిపోయిన పిల్లల గురించి తపనపడేలా చేస్తున్నాయి.
బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్… కొడుకు కోసమే ఆలోచిస్తున్నాడు. కరోనా వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితులు తనయుడు ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయపడుతున్నాడు. లాక్ డౌన్ ప్రకటించే సమయానికి అమీర్ కొడుకు జునైద్ మహారాష్ట్రలోని పాంచ్ గానీ హిల్ స్టేషన్ లో ఉన్నాడు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ముంబై లోనే ఉండిపోయారు. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ పూర్తవుతుంది అనుకున్నా… మళ్లీ పొడిగించడంతో కొడుకు గురించి ఆందోళన చెందుతున్నారు అమీర్.
కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ కూడా తన కొడుకు గురించి బెంగ పెట్టుకున్నాడు. తనయుడు సంజయ్ ను ఫిల్మ్ మేకింగ్ కోర్స్ కోసం ఏడాది క్రితం కెనడాకు పంపించాడు విజయ్. అక్కడ కూడా అధికంగా కరోనా కేసులు నమోదు అవుతుండడం… లాక్ డౌన్ కారణంగా ఇండియాలోకి అనుమతించక పోవడంతో విజయ్ బాధపడుతున్నాడు. కొడుకు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడుతున్నాడు. కెనడాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదు అవుతుండగా… సంజయ్ కు టెస్ట్ లు నిర్వహించగా నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు విజయ్ కుటుంబ సభ్యులు.
Tags : Amir Khan, Vijay, Bollywood, Kollywood, Sons, Corona, Covid 19