ఆరోజు అర్ధరాత్రి ట్యాంక్ బండ్ పై ప్రభాస్ అలా చేశాడు- హీరో సుధీర్ బాబు

by Anukaran |   ( Updated:2021-08-27 02:11:38.0  )
ఆరోజు అర్ధరాత్రి ట్యాంక్ బండ్ పై ప్రభాస్ అలా చేశాడు-  హీరో సుధీర్ బాబు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లో యంగ్ హీరోలందరికీ డార్లింగ్ ఎవరు అంటే ఠక్కున మన డార్లింగ్ ప్రభాస్ పేరు చెప్పేస్తారు. స్నేహానికి నిలువెత్తు నిదర్శనం ప్రభాస్ అంటే అతిశయోక్తి కాదు. ఇంకా ఆయన గురించి టాలీవుడ్ హీరోలు ఎన్నోసార్లు ఎంతో గొప్పగా చెప్పారు. ప్రభాస్ తో ఒక్కసారి స్నేహం చేస్తే వదలలేమని, అలాంటి మంచి మనసున్న స్నేహితుడు దొరకడం అదృష్టమని చెప్పుకొచ్చారు. ఇక తాజాగా ప్రభాస్ తో స్నేహం గురించి యంగ్ ట్యాలెంటెడ్ హీరో సుధీర్ బాబు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

https://twitter.com/isudheerbabu/status/1430889790258389003?s=20

హీరో సుధీర్ బాబు, ఆనంది జంటగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నేడు విడుదల సందర్భంగా ట్విట్టర్ లో అభిమానులతో ప్రశ్నల సెషన్ మొదలుపెట్టాడు. ఒక అభిమాని ప్రభాస్ తో ఎంజాయ్ చేసిన ఒక గుడ్ మెమరీని మాతో పంచుకోమని అడుగగా.. సుధీర్ ‘వర్షం’ సినిమా నాటి జ్ఞాపకాలను గుర్తుచేశారు. “మా ఇద్దరి మెమరీస్ చాలా ఉన్నాయి..’వర్షం’ సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా కోసం ఏర్పాటు చేసిన కటౌట్లను చూసేందుకు నేను, ప్రభాస్, దేవి శ్రీ కలిసి అర్ధరాత్రి హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్దకు వెళ్ళాము. అక్కడ సినిమా థియేటర్ల వద్ద ప్రభాస్ కటౌట్లను చూసి హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పై కూర్చొని రాత్రంతా ‘వర్షం’ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేశామని” చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

డార్లింగ్ స్నేహానికి ఎంత వాల్యూ ఇస్తాడో అని అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే వర్షం హిందీ రీమేక్ ‘బాఘీ’ చిత్రంలో గోపీచంద్ పాత్రను సుధీర్ పోషించగా.. ప్రభాస్ పాత్రలో టైగర్ ష్రాఫ్ కనిపించాడు.

Advertisement

Next Story