- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి హీరో శివాజీ మద్దతు
దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉద్యమ శిబిరాన్ని సినీనటుడు శివాజీ సందర్శించారు. ఉద్యోగులు, కార్మికుల పోరాటానికి శివాజీ మద్దతు ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఉక్కు పోరాటంలో ఎవరినీ గుడ్డిగా నమ్మెుద్దని హితవు పలికారు. సంస్థను కాపాడుకోవడం ఉద్యోగులుగా మీ బాధ్యత అని గుర్తు చేశారు. పాలకుల కంటే “కేఏ పాల్” బెటర్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ దుర్మార్గంగా స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తోంది అంటూ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్‌ను కామెడీగా చూపించి అవినీతి ముద్ర వేశారంటూ శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ స్టీల్‌ప్లాంటును 100 శాతం ప్రైవేటీకరిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విశాఖలో కార్మిక, నిర్వాసిత సంఘాలు నిరసనలకు దిగాయి. రహదారులు దిగ్బంధం చేస్తున్నాయ. అధికారులను అడ్డుకుంటున్నాయి. ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోకపోతే… ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు ప్రకటించాయి.