హీరో శివ కార్తికేయన్‌కు బేబీ బాయ్.. ఆ పేరుతో పిలుస్తామని ట్వీట్!

by Shyam |
హీరో శివ కార్తికేయన్‌కు బేబీ బాయ్.. ఆ పేరుతో పిలుస్తామని ట్వీట్!
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ‘జూలై 12న వారసుడు పుట్టాడు’ అంటూ బేబీ బాయ్‌ను ఎత్తుకున్న పిక్ షేర్ చేశాడు. ‘18 ఏళ్ల తర్వాత నా తండ్రి కొడుకు రూపంలో నా చేయి పట్టుకున్నట్లు ఉంది’ అని తెలిపాడు. ఇంత గొప్ప అదృష్టం కలిగించిన సతీమణికి ధన్యవాదాలు తెలిపిన హీరో.. తన తండ్రి ‘గుగన్ దాస్’ పేరునే కొడుకుకు పెడుతున్నామని తెలిపాడు. తన కుటుంబంపై కురిపిస్తున్న ప్రేమకు ఫ్యాన్స్‌కు థాంక్స్ చెప్పిన శివ కార్తిక్.. అందరి ఆశీర్వాదాలు కావాలని కోరాడు. కాగా శివ కార్తిక్ డాక్టర్, అయలాన్, డాన్ సినిమాలు విడుదలకు సిద్ధం కాగా.. మరో తెలుగు – తమిళ్ బైలింగువల్‌కు సైన్ చేసినట్లు సమాచారం.

Advertisement

Next Story