మూవీ టికెట్ ధరలపై మళ్లీ నోరెత్తిన నాని.. టాలీవుడ్‌ ఐక్యత లేదంటూ..

by srinivas |
మూవీ టికెట్ ధరలపై మళ్లీ నోరెత్తిన నాని.. టాలీవుడ్‌ ఐక్యత లేదంటూ..
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో టికెట్ ధరలపై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన నేచురల్ స్టార్ నాని తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో ఐకమత్యం లేదంటూ చెప్పుకొచ్చారు. ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏపీలో సినిమా టికెట్ రేట్లపై నా అభిప్రాయం మాత్రమే చెప్పానని వివరణ ఇచ్చాడు. దాన్ని చీల్చి పెద్ద ఇష్యూ చేశారని వ్యాఖ్యానించారు. ‘నేను లేవనెత్తిన సమస్య వాస్తవం. అయితే సమస్య వచ్చినప్పుడు అందరూ ఒక్కటి కావాలి. కానీ టాలీవుడ్‌లో ఆ ఐకమత్యం లేదు. వకీల్ సాబ్ సినిమా టికెట్ల ధరలు తగ్గించినప్పుడే అందరూ ఏకతాటిపైకి వచ్చి ఉంటే బాగుండేది. ఆ రోజు అందరూ మేల్కొంటే నేడు ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు కదా’ అని హీరో నాని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed