జులై 1 నుంచి హీరో మోటోకార్ప్ బైక్, స్కూటర్ల ధరల పెంపు

by Harish |
జులై 1 నుంచి హీరో మోటోకార్ప్ బైక్, స్కూటర్ల ధరల పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన మోటార్ సైకిల్, స్కూటర్ల ధరలను పెంచనున్నట్టు మంగళవారం ప్రకటించింది. వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పాక్షికంగా ఈ భారాన్ని తగ్గించేందుకు వాహనాలపై ధరల పెంపు నిర్ణయం తీసుకుంటున్నట్టు కంపెనీ తెలిపింది. ధరల పెంపు నిర్ణయం జులై 1 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే, వినియోగదారులపై పడే ఈ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కంపెనీ మరింత వ్యూహాత్మకంగా వ్యయ పొదుపును కొనసాగించనున్నట్టు హీరో మోటోకార్ప్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

మోటార్ సైకిళ్లు, స్కూటర్లపై ధరల పెరుగుదల రూ. 3 వేల వరకు ఉంటుందని, మోడల్‌ని బట్టి ఈ పెంపులో వ్యత్యాసం ఉంటుందని కంపెనీ వివరించింది. దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి సైతం సోమవారం వివిధ మోడల్, వేరియంట్‌ని బట్టి ధరల పెంపు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో దిగ్గజ కార్ల తయారీ సంస్థ హ్యూండాయ్ మోటార్ ఇండియా ఇన్‌పుట్ ఖర్చుల ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్‌లో వాహనాల ధరలను పెంచే ఆలోచన లేదని చెబుతోంది. ప్రస్తుతం ఖర్చులను నియంత్రించే పనిలో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed