హీరో మోటోకార్ప్ అమ్మకాల్లో 27 శాతం క్షీణత

by Harish |
హీరో మోటోకార్ప్ అమ్మకాల్లో 27 శాతం క్షీణత
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ జూన్‌లో విక్రయాలు 26.8 శాతం క్షీణించి 4,50,744 యూనిట్లుగా నమోదైనట్టు కంపెనీ ప్రకటించింది. గతేడాది ఇదే నెలలో హీరో మోటోకార్ప్ 6,16,526 యూనిట్లను విక్రయించింది. అయితే, మే నెలతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు అధికమని కంపెనీ తెలిపింది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పనితీరు తగ్గిన తర్వాత జూన్‌లో కరోనాకు ముందున్న దాంట్లో 90 శాతం తిరిగి సాధించినట్టు కంపెనీ తెలిపింది. ఫిబ్రవరిలో హీరో మోటోకార్ప్ 4.98 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఈ విక్రయాలు అసాధారణమని, వరుస నెలల్లో నమోదైన క్షీణతలతోనూ, గతేడాది అమ్మకాలతోనూ దీన్ని పోల్చలేమని కంపెనీ పేర్కొంది.

ఇక, 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో హీరో మోటోకార్ప్ మొత్తం 5,63,426 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. కరోనా సమయంలో అనేక ప్లాంట్లు మూసేయబడ్డాయి. ఈ ప్రభావం కారణంగా ప్లాంట్లలో కార్యకలాపాలు, రిటైల్ ఔట్‌లెట్లు మూతబడటంతో ఏప్రిల్, మే నెలల్లో అమ్మకాలు బాగా తగ్గాయని కంపెనీ వివరించింది. ‘సుధీర్ఘ అంతరాయం ఏర్పడినప్పటికీ, అమ్మకాలు స్థిరంగా కొనసాగాయని, తాము వినియోగదారుల విశ్వాసం, నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని హీరో మోటోకార్ప్ ఛైర్మన్, సీవో పవన్ ముంజల్ తెలిపారు. మార్కెట్ డిమాండ్‌లో ప్రధాన భాగం గ్రామీణ, సెమీ అర్బన్ మార్కెట్ల నుంచే ఉందని, ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలతో పంటల సీజన్, పండుగల సీజన్ కారణంగా విక్రయాలు పుంజుకున్నాయన పవన్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed