పోలీసులు.. మీ శ్రమ అసాధారణం: మహేష్

by Shyam |   ( Updated:2020-04-09 01:36:19.0  )
పోలీసులు.. మీ శ్రమ అసాధారణం: మహేష్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా ప్రభావంతో నెలకొన్న అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు సూపర్ స్టార్ మహేష్ బాబు. కోవిడ్ 19పై యుద్ధానికి నేతృత్వం వహించిన పోలీసు బలగానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. పోలీసుల అలుపెరుగని కఠోర శ్రమ అసాధారణమని ప్రశంసించారు. ఇలాంటి విపత్కర సమయాల్లో మా జీవితాలను, మా కుటుంబాల ఆరోగ్యాన్ని రక్షిస్తున్న మీకు రుణపడి ఉంటామన్నారు. మన దేశం, ప్రజల పట్ల మీ నిస్వార్థ అంకిత భావానికి వందనాలు అంటూ సెల్యూట్ చేశారు మహేష్.

కరోనా ఎఫెక్ట్‌తో జీవనోపాధి లేక కష్టాలు అనుభవిస్తున్న నిరుపేదలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన మహేష్ .. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి రూ. కోటి విరాళం అందించారు. అలాగే సినీ కార్మికులకు భరోసానిస్తూ కరోనా క్రైసిస్ చారిటీకి రూ. 25 లక్షల సాయాన్ని అందించారు ప్రిన్స్. దీంతో పాటు లాక్ డౌన్ సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూనే ఉన్నాడు మహేష్.


Tags: Mahesh Babu, Police, Corona, CoronaVirus, Covid19, Telangana police department

Advertisement

Next Story