- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు కొత్త ఎలక్ట్రిక్ సైకిళ్లను విడుదల చేసిన హీరో లెక్ట్రో!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రిక్ సైకిల్ తయారీ బ్రాండ్ హీరో లెక్ట్రో సోమవారం దేశీయ మార్కెట్లోకి తన కొత్త ఎలక్ట్రిక్ మౌంటెన్ సైకిళ్లను విడుదల చేసింది. వాటిలో ‘ఎఫ్2ఐ ధరను రూ. 39,999గా, ఎఫ్3ఐ ధరను రూ. 40,999గా నిర్ణయించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ మౌంటెన్ సైకిల్ 6.4ఏహెచ్ ఐపీ67 బ్యాటరీలతో 250 వాట్ల మోటార్‌తో పనిచేయనున్నాయి. ఈ సైకిళ్ల లో వినియోగదారులు తమకు అనుకూలమైన నాలుగు వేరియంట్లలో కొనే వెసులుబాటు ఉంటుందని కంపెనీ తెలిపింది. అందులో పెడెలెక్(35 కి మీ పరిధి), థ్రాటిల్)27 కి మీ పరిధి), క్రూజ్ కంట్రోల్, మాన్యూవల్ వేరియంట్లు వస్తాయని, ఇవి స్మార్ట్ ఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంటాయని కంపెనీ పేర్కొంది.
అంతేకాకుండా బ్లూటూత్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో లభిస్తాయని, దీనిద్వారా రైడింగ్ చేసేవారికి ప్రయాణానికి సంబంధించిన కీలక వివరాలను తెలుసుకొవచ్చని కంపెనీ వివరించింది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లు దేశవ్యాప్తంగా 600 కంటే ఎక్కువ డీలర్ నెట్‌వర్క్‌లు, ఈ-కామర్స్ కంపెనీల ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. ‘ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ సైకిల్ విభాగంలో తాము మొదటిసారిగా కనెక్టింగ్ ఈ-సైకిళ్లను తీసుకొచ్చాం. రానున్న రోజుల్లో హీరో లెక్ట్రో మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా, పర్యావరణ అనుకూల వాహనాలకు ప్రాధాన్యత ఇచ్చే వారికి మెరుగైన ఎంపికగా నిలుస్తుందని.. తాను ఆశిస్తున్నట్టు’ హీరో లెక్ట్రో సీఈఓ ఆదిత్య ముంజల్ అన్నారు.