ఆ పాఠశాలలో మగ టీచర్లు, అబ్బాయిలు స్కర్ట్‌లు ధరించాల్సిందే

by vinod kumar |   ( Updated:2021-11-10 07:05:21.0  )
Boys Skirts
X

దిశ, వెబ్‌డెస్క్ : లింగ సమానత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో స్కాట్లాండ్‌లోని ఓ పాఠశాలలో మగ ఉపాధ్యాయులు, విద్యార్థులను సైతం స్కర్ట్ ధరించమని ప్రోత్సహించింది. నవంబర్ 4వ తేదీన ఎడిన్‌బర్గ్‌లోని కాసిల్‌వ్యూ ప్రైమరీ పాఠశాలలో మగ ఉపాధ్యాయులు, విద్యార్థులు మొదటిసారిగా ‘పాఠశాలకు స్కర్ట్ ధరించండి’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘మా పాఠశాలలో అందరినీ కలుపుకొని, సమానత్వాన్ని ప్రోత్సహించాలని మేము కోరుకుంటున్నాం’ అని ఎడిన్‌బర్గ్‌లోని కాసిల్‌వ్యూ ప్రైమరీ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు ఇ-మెయిల్ పంపింది. ఇలా రోజు పిల్లల తల్లిదండ్రులకు మెయిల్ పంపింది. పిల్లలు సౌకర్యవంతంగా ఉండాలని పాఠశాల కోరుకుంటుందని, అలాగే స్కర్టుల కింద లెగ్గింగ్‌లు లేదా ఇతర ప్యాంట్‌లు ధరించవచ్చని ఇ-మెయిల్ చేసింది. పాఠశాల విద్యార్థులకు స్కర్టులు లేకుంటే వారికి వాటిని అందజేస్తామని పేర్కొంది.

Male Teachers Skirts

కాసిల్‌వ్యూ ప్రైమరీలో ఉపాధ్యాయుడు అయిన మిస్ వైట్ ఫొటోలను ట్వీట్ చేశారు. పాఠశాలకు వీలైనంత ఎక్కువ మంది సిబ్బందిని, విద్యార్థులను స్కర్టులు ధరించేలా చేస్తున్నారని ఉపాధ్యాయుడు పేర్కొన్నాడు. అయితే ఈ విధంగా స్కర్ట్‌ను తప్పక ధరించి రావాలని మేము చెప్పలేదని.. పిల్లలు స్వచ్ఛందంగా ధరిస్తున్నారని మిస్ వైట్ నొక్కిచెప్పారు. ఇలాంటి గొప్ప కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటారని ఆమె ఆశిస్తున్నట్లు తెలిపింది. ఈ ఉద్యమానికి గల కారణం స్పెయిన్‌లో జరిగిన ఓ ప్రచారమే. మైకెల్ గోమెజ్‌కు అనే విద్యార్థి ఈ చర్యకు మద్దతుగా నిలిచాడు. అయితే అతను గత సంవత్సరం సరైన డ్రస్ ధరించలేదని బహిష్కరించబడ్డాడు.

విద్యార్థులు తరగతికి స్కర్టులు ధరించి రావాలనే నిర్ణయాన్ని చాలా మంది తల్లిదండ్రులు ప్రశంసించారు. మరికొందరు ఈ నిర్ణయం మంచిదేనా అని ప్రశ్నిస్తూ విమర్శించారు. ఒక పేరెంట్, “కాజిల్‌వ్యూ మీకు సిగ్గుచేటు.. ఇది చాలా చెత్త నిర్ణయం.. దీని వల్ల ఏంటీ లాభం? మీ వద్ద ఉన్న విద్యార్థులకు మంచి విద్య నేర్పించండని విమర్శించాడు. మరొక పేరెంట్.. “అవమానకరమైనది.. పిల్లలకు వారి బేసిక్స్ ఏంటో నేర్పండి. ఈ బ్లడీ నాన్సెన్స్ అన్నింటినీ ఆపండి. అని అన్నారు.

దీనిపై సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ కౌన్సిల్ ప్రతినిధి మాట్లాడుతూ “స్కాట్లాండ్ రాజధాని నగరంగా మేము సమానత్వాన్ని, వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ముఖ్యంగా మా పాఠశాలల్లో గౌరవం, సహనం అలాగే అవగాహనను పెంచడానికి ఆసక్తిగా ఉన్నాం. కాసిల్‌వ్యూ పాఠశాల అంతటా సమానత్వాన్ని ప్రోత్సహించడానికి చాలా సానుకూలమైన పనిని చేస్తోందని పేర్కొన్నారు.

Anchor Sreemukhi :చూపులతో చంపేస్తోన్న రాములమ్మ.

Advertisement

Next Story

Most Viewed