కోపంతో ప్యాడ్‌ను తన్నిన రష్మిక.. వీడియో వైరల్

by Shyam |
Rashmika Mandanna
X

దిశ, సినిమా: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలతోనే ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్‌ రష్మిక మందన్న.. తాజాగా జిమ్‌ సెంటర్‌లో వర్కౌట్‌ చేస్తున్న వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరిచే రష్మిక.. ఖాళీగా ఉండే రోజులో ఎక్కువ సమయం జిమ్‌లోనే గడిపేస్తూ తన బాడీని స్లిమ్‌గా మెయింటెన్ చేస్తుంది. ఈ క్రమంలోనే తను చేసిన వర్కవుట్‌లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

అయితే ప్రస్తుతం పోస్ట్ చేసిన వీడియోలో.. రష్మిక తన ఫిట్‌నెస్ ట్రైనర్ పట్టుకున్న స్ట్రైకింగ్ ప్యాడ్‌ను పదేపదే తన్నుతున్నట్లు చూడొచ్చు. ఆమె ఎగిరెగిరి తన్నుతుంటే.. మరింత గట్టిగా తన్ను అంటూ రష్మికను ప్రోత్సహిస్తున్నాడు ట్రైనర్‌. ఈ వీడియోని రష్మిక ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. చాలా కోపంగా ఉన్నప్పుడు నేను ఏమి చేస్తాను’అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. రష్మిక వీడియోకి నటుడు, దర్శకుడు తనదైన శైలీలో స్పందిచాడు. ‘ఈ వీడియో చూశాక ఏ దర్శకుడైనా నిన్ను రీటేక్‌ కోసం అడుగుతాడా? టేక్‌ ఓకే’ అంటూ కామెంట్‌ చేయడం విశేషం. ఇక ఈ నేషనల్ క్రష్ ప్రస్తుతం సిద్ధార్థ్‌తో ‘మిషన్ మజ్నూ’లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed