#betheREALMAN చాలెంజ్ : రానా, శర్వాతో పాటు రణ్ వీర్ ను నామినేట్ చేసిన చెర్రీ

by Jakkula Samataha |
#betheREALMAN చాలెంజ్ : రానా, శర్వాతో పాటు రణ్ వీర్ ను నామినేట్ చేసిన చెర్రీ
X

డైరెక్టర్ సందీప్ వంగా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆయన స్టార్ట్ చేసిన #betheREALMAN చాలెంజ్ లాక్ డౌన్ టైమ్ లో అటు ఇంట్లో మహిళలకి పని భారం తగ్గించడమే కాదు… ఇటు ప్రేక్షకులకూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే… మెసేజ్ ఇస్తుంది. ఆడ మగ తేడాలేకుండా మన ఇంట్లో పని కలిసి చేసుకోవడంలో తప్పు లేదని సందేశం ఇస్తుంది. కాగా ఈ చాలెంజ్ లో రాజమౌళి చరణ్ ను నామినేట్ చేయగా… ఈ చాలెంజ్ ను స్వీకరిస్తూ సోషల్ మీడియాలో వీడియో అప్ లోడ్ చేశాడు చెర్రీ.

చాలెంజ్ లో భాగంగా ఇంట్లో బట్టలు ఒక దగ్గర పెట్టేసి… ఇళ్లు మొత్తం శుభ్రంగా తుడిచాడు చెర్రీ. ఆ తర్వాత మొక్కలకు నీళ్లు పోసి… కాఫీ ప్రిపేర్ చేసి… చివరగా భార్య ఉపాసనకు కాఫీ అందించడంతో చాలెంజ్ వీడియో ఎండ్ అయింది. ఇంట్లో పనులను చేయడంలో గర్వపడదాం! నిజమైన పురుషులుగా ఉండి, పని భారాన్ని పంచుకోవడం ద్వారా మహిళలకు సహాయం చేద్దామని పిలుపునిచ్చారు చరణ్. చాలెంజ్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన చరణ్… #BetheREALMAN చాలెంజ్ కు దర్శకుడు త్రివిక్రమ్, బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, తన ఫ్రెండ్స్ రానా దగ్గుబాటి, శర్వానంద్ లను నామినేట్ చేశారు.

కాగా సందీప్ వంగా తో స్టార్ట్ అయిన #betheREALMAN చాలెంజ్ రెండు రోజుల్లోనే టాలీవుడ్ లో వైరల్ కాగా… ఇప్పుడు చరణ్ రణ్ వీర్ సింగ్ ను నామినేట్ చేయడం ద్వారా బాలీవుడ్ కు కూడా ఎంటర్ అవుతుంది. అక్కడ కూడా ఇంతే ఊపుతో చాలెంజ్ వైరల్ అవుతుందనే అంటున్నారు.

Tags : Ram Charan Tej, Rana Daggubati, Sandeep Vanga, SSRajouli, Ranveer Singh, Sharwanand, betheREALMAN, challenge

Advertisement

Next Story

Most Viewed