- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ ఫోన్ లో ఇలా చేస్తున్నారా..? అయితే మీ ఫోన్ హ్యాక్ అయినట్టే
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ లేనివారు లేరు అంటే అతిశయోక్తి కాదు. వ్యక్తిగత, వ్యాపార సంబంధిత విషయాలన్నీ ఫోన్లోనే భద్రపరుస్తూ ఉంటారు. అలా భద్రపరిచేటప్పుడు తగు జాగ్రత్తలు ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఆన్ లైన్ హ్యాకర్లు ఎప్పుడు మీరు చేసే చిన్న చిన్న తప్పులపై కన్ను వేసి ఉంచుతారు. ఫోన్ లో మీరు చేసే చిన్న తప్పులే హ్యాకర్స్ కి ఆయుధాలుగా మారుతున్నాయి. మీ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశాలు ఎలా ఉంటాయనేది మీరు ముందుగా తెలుసుకోవాలి.
కాంటెస్ట్ మెసేజ్
మీ ఫోన్ నంబర్ ఈ కాంటెస్ట్ లో గెలిచింది. మీరు లక్ష రూపాయలు బహుమతి గెలుచుకున్నారు. ఈ లింక్ ఓపెన్ చేసి మీ పూర్తీ వివరాలు పంపితే బహుమతి మీ ఇంటికి వస్తుంది. ఇలాంటి మెసేజ్లు రోజు వస్తున్నాయా? అయితే గిఫ్ట్ కి ఆశపడి వెంటనే లింక్ ఓపెన్ చేయకండి. ఇది హ్యాకర్లు మీకు వేస్తున్న వల. అలాంటి నంబర్లని బ్లాక్ లిస్టులో పెట్టండి. క్లిక్ చేసారంటే అయిపోయినట్టే.
అనుమానాస్పద ఫోన్ కాల్స్
తెలియని నంబర్ నుండి కాల్ వస్తుంది.. మీకు తెలిసిన వాళ్లేమో అని మీరు ఫోన్ లిఫ్ట్ చేశారు. మీకు అర్ధం కానీ భాషలో వారు మాట్లాడుతుంటే.. ఆ సంభాషణను వెంటనే ఆపేయండి. ఆ ఫోన్ నంబర్ మన దేశం నుండి కానట్లయితే అస్సలు వాటిని ఎత్తకండి. ఒక వేళ అలాంటి కాల్స్ రిసీవ్ చేసుకుంటే వెంటనే మీ ఫోన్ మాల్వేర్స్ ఫోన్లోకి వెళ్ళే అవకాశం ఉంది.
అన్ని యాప్స్ కి ఒకే పాస్ వర్డ్ ఉందా?
స్మార్ట్ ఫోన్లో ప్రతి యాప్స్ కి లాక్ ఉంటుంది. మీ పర్సనల్, ప్రొఫెషనల్ లావాదేవీలు ఉపయోగించే యాప్స్ కి ఖచ్చితంగా రహస్యంగా పెట్టుకోవాలి. వాటికి సంబంధించిన పాస్ వర్డ్ కూడా చాలా గట్టిగా ఉండాలి. అన్నీ యాప్స్ కి ఒకే పాస్ వర్స కాకుండా ప్రతిదానికి వేరే వేరే పాస్ వర్డ్స్ ని పెట్టుకోవడం ఉత్తమం. ఈ మెయిల్, నెట్ బ్యాంకింగ్, వాట్స్ యాప్ వీటికి పాస్ వర్డ్ ని ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలాగే పాస్ వర్డ్ బలహీనంగా ఉన్నట్లయితే కూడా హ్యాక్ అవుతుంది. మీ పాస్వర్డ్ లో ఆల్ఫాబెట్స్ తో పాటు నంబర్స్, ఇంకా స్పెషల్ గుర్తులు ఉండేలా చూసుకోండి.
పబ్లిక్ ప్లేస్ ల్లో ఉన్నప్పుడు..
కాఫీ షాప్ కి వెళ్ళినప్పుడు, రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడో.. షాపింగ్ చేస్తూ ఫోన్ పక్కన పెడుతున్నారా? జాగ్రత్త.. హ్యాకర్స్ మీ ఫోన్ని హాక్ చేసే అవకాశం ఉంది. కాఫీ షాప్ లో కూర్చొని ల్యాప్ టాప్ లో వర్క్ చేస్తున్నారా? లాగ్ అవుట్ చేయకుండా పక్కకి కూడా వెళ్ళకండి. ఎందుకంటే మీ సమాచారాన్ని హ్యాకర్స్ దొంగిలించే అవకాశం ఉంది. లాక్ వేయకుండా ల్యాప్ టాప్ విడిచి వెళ్ళవద్దు. చుట్టుపక్కల వాళ్ళు ఎలాంటి వారనేది తెలియదు కాబట్టి జాగ్రత్త అవసరం.
యాప్స్ ని అప్ డేట్ చేస్తున్నారా?
ఎప్పటికప్పుడు మీ ఫోన్ ని అప్ డేట్ చేస్తూ ఉండండి. యాప్స్ ని అప్ డేట్ చేయడం వలన కొత్త ఫీచర్స్ యాడ్ అవుతాయి.. తరచుగా యాప్స్, ఆపరేటింగ్ సిస్టమ్ ని అప్డేట్ చేస్తూ ఉండడం వలన ఫోన్ లో ఉన్న అనవసరమైన స్టోరేజ్ పోవడంతో పాటు హ్యాక్ కాకుండా కాపాడుకోవచ్చు. ఇలా కొన్ని కొన్ని టిప్స్ ని పాటించడం వలన హ్యాకర్ల వలనుండి మిమ్మల్ని, మీ ఫోన్ ని కాపాడుకోండి.