- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షర్మిల భర్త అరాచకం.. వాళ్లతో మాట్లాడవద్దని హుకుం
దిశ, వెబ్‌డెస్క్ : రోజురోజుకు భార్యలపై భర్తలకు అనుమానం పెరిగిపోతోంది. పేద, ధనిక అని భేదం లేకుండా ఏ స్థాయిలో ఉన్నా మహిళలకు ఈ అవమానాలు తప్పడం లేదు. కొన్నిసార్లు ఈ అనుమానాలే పెనుభూతలై హత్యలకు దారి తీస్తోంది. తాజాగా ఓ భర్త ఆయన భార్యను అనుమానించడమే కాకుండా మగవాళ్లతో మాట్లాడనని అగ్రిమెంట్ రాసివ్వాలని పట్టుబట్టడం సంచలనంగా మారింది. భర్త మాట వినపోవడంతో కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగింది.
15 ఏళ్ల క్రితం అనంతపురం పట్టణానికి చెందిన షర్మిలకు గుంతకల్లుకు చెందిన రజాక్‌తో వివాహం అయింది. ఈ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె సంతానం. కూరగాయల వ్యాపారం చేసే ఈ దంపతుల కాపురం ఇన్నాళ్లు సజావుగానే సాగింది. అయితే వ్యాపార రిత్యా కూరగాయలకు వచ్చిన మగాళ్లతో షర్మిల మాట్లాడటాన్ని భర్త జీర్ణించుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే రజాక్ భార్యపై అనుమానం పెంచుకున్నాడు.ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇటీవల షర్మిలను తీవ్రంగా కొట్టడంతో ఆమె పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.
తాజాగా మూడు రోజుల క్రితం మళ్లీ దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. అయితే పరాయి పురుషులతో మాట్లాడనని హామీపత్రం రాసిచ్చి సంసారానికి రావాలని రజాక్ భార్యను కోరాడు. దీనికి షర్మిల అంగీకరించకపోవడంతో ఆగ్రహించిన భర్త.. కత్తితో భార్యపై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.