హైదరాబాద్‌ను కమ్మేసిన మబ్బు.. భారీ వర్షం

by Shyam |
హైదరాబాద్‌ను కమ్మేసిన మబ్బు.. భారీ వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: నాలుగు రోజుల క్రితం కురిసిన అతి భారీ వర్షంతో ఇప్పడిప్పుడే కోలుకుంటున్న హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షం మొదలైంది. శనివారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతవరణం మారి ఉరుములు, మెరుపులతో వాన దంచి కొడుతోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్‌పల్లి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, ఎల్బీనగర్‌, హయత్‌నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల ఇప్పుడిప్పుడే వరదను ఎత్తిపోస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు ఎదరవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరాన్ని మొత్తం నల్లటి మబ్బు కప్పేయడంతో మరోసారి అతి భారీ వర్షం కురుస్తుందా అన్న భయంతో ప్రజలు టెన్షన్ పడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed